Author: Unknown
•Friday, March 26, 2010
ప్రతి వారం, మరియు వారాంతం ఎవో సినిమాలు చూసేస్తూ ఉన్నా, ప్రత్యేకం గా ఇలా పోస్ట్ ఇప్పుడు వ్రాయటానికి కారణం ఏంటంటే..

ఈ వారం నేను మూడు వైవిధ్యమైన, ఆలోచింపజేసే సినిమాలు చూడటమే !

అవి..

The Blind Side
ఒరే కడల్
Page 3

మూడు కూడా నాన్-తెలుగు సినిమాలు. ఒకటి ఆంగ్లం, ఒకటి మళయాళం మరొకటి హిందీ.
ఈ మూడిటి గురించి ఇప్పటికే ఎన్నో రివ్యూలు, విశ్లేషణాత్మక వ్యాసాలు వచ్చినా, వీటి గురించి నాకూ కొంత చెప్పాలనిపిస్తుంది.

ముందుగా..

The Blind Side

*ing: Sandra Bullock, Tim McGraw, Quinton Auron

This movie is based on a True Story ( story of Michel Oher, an NFL star, Baltimore Ravens Team )

ఈ సినిమాలో నటనకు కాను, సాండ్రా కు ఉత్తమ నటి అవార్డ్ ( ఆస్కార్) సొంతం చేసుకుంది. సాధారణం గా అవార్డ్ సినిమాలన్నీ అంతగా బాగోవు, కొన్ని బోరింగ్ గా, చాలా స్లో గా, ఎందుకు అవార్డు ఇచ్చార్రా బాబో ఈ సినిమాకి అనిపించేలా ఉన్నాయి. కానీ, ఈ సినిమాలో Sandra gave ultimate performance of her career.

ఈ సినిమా ఎంత బాగా నచ్చినందంటే, కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. మనుషుల్లో ఉండే జాలి, మానవీయత, దయాగుణం, కరుణ శాండ్రా పాత్ర ద్వారా మనం చూడొచ్చు. మనుషుల్లో మంచితనం మనసుల్ని ఎలా కదిలిస్తుందనేదీ ఈ సినిమా ద్వారా అనుభూతి చెందుతాం.

కధ : ఒక అనాధ అయిన ఆఫ్రికన్ అమెరికన్ ని ఒక శ్వేత జాతీయురాలు, ఆమె కుటుంబం దగ్గరకు తీసుకుని, తమ కుటుంబంలో ఒకడిలా చేర్చుకుని, అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందీ, అతని విజయానికి ఎలా తోడ్పడింది అనేదే ఈ సినిమా కథ !

కధ చిన్నదే అయినా, కధనం చాలా ఆసక్తిగా ఉంది, ప్రతి ఒక్కరూ ఎంతో బాగా నటించారు. Sandra Bullock భర్త గా వేసిన అతను ఒక ఫేమస్ కంట్రీ మ్యూజిక్ సింగర్ Tim McGraw ( Husband of another famous singer Faith Hill). నాకు S.J. గా వేసిన పిల్లాడు ఎంతో క్యూట్ గా అనిపించాడు.

ఇక్కడ నలుపూ తెలుపు అని కాకుండా, ఒక ఉన్నతమైన, డబ్బున్న కుటుంబం, అత్యంత దీన, దుర్భరమైన పరిస్తితుల్లో ఉన్న ఒక అబ్బాయిని అంతగా ఆదరించటం, అప్యాయం గా తమ కుంటుంబం లోకి చేర్చుకోవటమనేది నాకు నచ్చింది.

దీంట్లో మనసుని కదిలించే సన్నివేశాలెన్నో..ఎన్నెన్నో..
మెలో డ్రామా లేదు, కాని కొంత నాటకీయత ఉన్నా, ఈ సినిమాకి ఇది అవసరం అనుకోవాలేమో.


Its an inspiring movie. I strongly recommend this movie to watch ! Don't miss it !!!

ఈ ఫొటో లో కుడివైపు నుంచి రెండో ఆమె పాత్రనే సినిమాలో శాండ్రా పోషించారు.

Collins Tuohy, S.J. Tuohy, Leigh Anne Tuohy, Sean Tuohy




Michel Oher and his family !




ఇక రెండవది

ఒరే కడల్:

ఈ సినిమా గురించి ఇప్పటికే ఒక మంచి వ్యాసం ‘నవతరంగం’ లో వచ్చేసింది. నేను ఈ సినిమా చూడటానికి కారణం ఆ వ్యాసమే ! Thanks to Katti Mahesh Kumar for introducing this movie to us.

ఈ సినిమాని నేను Youtubఎ లో చూసాను. సబ్ టైటిల్స్ తో చాలా బాగుంది వీడియో క్వాలిటీ కూడా..

ఈ సినిమా గురించి నేను ఊహించినట్లే ఉంది, చాలా బాగా నచ్చింది.

ముఖ్యం గా మీరా జాస్మిన్ ఒక అందమైన, అమాయకమైన మధ్యతరగతి గృహిణి పాత్రలో ఒదిగిపోయారు. ఇక మమ్ముట్టి నటన గురించి కొత్తగా చెప్పేదేముంది.

ఇది ఒక సినిమా చూస్తున్నట్లుండదు. జీవితాన్ని చాలా దగ్గరగా చూస్తున్న అనుభూతి. ఇద్దరు వ్యక్తుల మానసిక సంఘర్షణ ని మనం కూడా ఫీల్ అయ్యేలా ఉంటుంది చూస్తున్నంత సేపూ…

కధ గురించి చెప్పాలంటే..

అనుభంధాలకి, ప్రేమకి దూరం గా ఉండే ఒక మేధావికి పరిస్తితుల ప్రభావంతో మానసికం గా, శారీరకం గా దగ్గరైన ఒక గృహిణి కధ ! ఈ ఒక్క లైన్ చూడగానే చాలా మందికి అనిపించేది, ఏంటిది, మోరల్ గా ఆమెకు విలువలు లేవా? ఇలా బరితెగించి వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఇలా అనుభవించవలసిందే అని ఆగ్రహిస్తారు. కానీ, ఒక్క సారి ఈ సినిమా చూసాక ఆ అభిప్రాయం మారుతుంది. ఆ పాత్ర మీద జాలేస్తుంది, ఆలోచింపజేస్తుంది, బాధ పెడుతుంది, మనసుని కదిలిస్తుంది.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన మరో అంశం, సంగీతం, పాటలు. నేపధ్య సంగీతం కానీ, పాటలు కాని సినిమా మూడ్ కి తగ్గట్టుగా గుండెల్ని పిండేస్తుంది, కళ్ళలో చెమ్మని చేరుస్తుంది. ఆధ్బుతం అనే మాట చాలా చిన్నది ఈ సినిమా సంగీతం గురించి చెప్పవలసి వస్తే ! Haunting Music !

Title song !



'యమున వెరుదే '



కొసమెరుపు: ఈ సినిమాలోని చిన్న పాప నాకు తెగ నచ్చేసింది. ఎంత ముద్దుగా ఉందో..

మూడవది, చివరిది:

Page 3

ఇది పాత సినిమానే కానీ, ఇప్పటివరకు చూడలేదు నేను. ఈ సినిమా గురించి విన్నా కానీ, ఎందుకో ఇప్పటివరకు చూసే చాన్స్ రాలేదు.

నాకు కోంకణా సేన్ అంటే చాలా ఇష్ఠం !
"సంతానం ..సంతానం" అంటూ ముద్దుగా పిలిచే MrMrs.Iyer సినిమా నుంచే నాకు బాగా నచ్చేసింది. Simple & Talented Actress !

ఈ సినిమా అంతా తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకం గా Depressing and Dark movie అయినప్పటికీ, మధుర్ బండార్కర్ సినిమాలో కనిపించే 'నిజాయితీ కూడిన నిజం' నన్ను అలా కట్టి పడేసింది సినిమా చివరి వరకూ.

మెట్రో సిటీల్లో ఉండే పార్టీ కల్చర్, రిచ్ సొసైటీ, వాళ్ళ మనసుల్లో ఉండే మలినాలు, వికృత చర్యలు, మోసాలు, మోసపోవటాలు, ఆర్ధిక పరమైన సంబంధాలు, అవసరాలు ఇలా ఒక్కటేమిటి, ఎన్నో కోణాల్ని మనం చూస్తాం ఈ సినిమాలో.

మనుషుల్లో ఉండే వికృత చర్యల్ని చూసి అసహ్యించుకుంటాం, భయపడతాం, బాధ పడతాం ! ఎందుకు ఇలా వీళ్ళ మనసులు సున్నితత్వాన్ని కోల్పోయి బండబారి పోయాయని ఆలోచనలో పడతాం ! జీవితం అంటే ఇంతేనా అని నిరాశ పడతాం ! దేనికోసం ఈ ప్రాకులాట అని అంతర్మధం ! ఇలా పరివిధాలుగా మనసుని మెలిపెడుతుంది ఈ సినిమా !

నేను పైన చెప్పిన మొదటి సినిమా The Blind Side మనుషుల్లో మానవీయతా, జాలి, మంచితనపు కోణాలు చూపిస్తే, ఈ సినిమా, అసహ్యం, బాధ, కోపం అనే మరో యాంగిల్ ని చూపిస్తుంది.

అందుకే అన్నాను ఈ వ్యాసం మొదట్లో.. నేను ఈ వారం చూసిన ఈ మూడూ, ఒకదానికొకటి వైరుధ్యమైన కధలు. విభిన్నమైన అంశాలు. కానీ మూడిటిలో ఉన్న ఒక కామన్ పాయింట్: ఆలోచింపజేసే కధ, కధనం ! సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు, వాటి చిత్రీకరణ !

అందుకే ఈ మూడూ నాకు బాగా నచ్చాయి. ఈ మూడూ నన్ను మరి కొన్నాళ్ళు వెంటాడుతూనే ఉంటాయి !