Author: Unknown
•Tuesday, April 06, 2010


2003 లో విడుదలైన ఈ మూవీ ని ఇప్పటికి మూడు సార్లు చూసుంటాను.
చూస్తున్న ప్రతి సారీ అదే ఇంటెన్స్ ఫీలింగ్ ! అంతే end of the edge feeling !

కధ American law చుట్టూ తిరుగుతుంది. అమెరికా లోని చట్టాలలో, కోర్టులలో, కేసుల్లో, వాటి న్యాయ నిర్ణయాల్లో జ్యూరీ కి ఉండే ప్రాముఖ్యత చెప్తుంది.

ఇక్కడ జ్యూరీ గురించి నాకు తెలిసినంత వరకు కొంత వివరణ ఇస్తాను.


కోర్టుకి వచ్చిన కేసులకి, వాది ప్రతివాది న్యాయవాదులతో పాటు ప్రభుతం జ్యూరీ మెంబెర్స్ ని రాండం గా ఎన్నుకుంటారు సామాన్య ప్రజల్లో నుంచి. వీళ్ళు ఆ కేసుకి కానీ, ఆ కేసుల్లో ఉన్న మనుషలకి కానీ ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. ఆమెరికన్ సిటిజెన్స్ ని మాత్రమే సెన్నుకుంటారు. దీన్నే Jury Duty అంటారు. Civil cases కి 6, అదే criminal cases కి అయితె 12 మంది ని ఎన్నుకుంటారు.

ఇదీ క్లుప్తంగా jury members గురించి వివవరణ. Trials are too important to be decided by juries.

అలా ఒక కేస్ కి ఎన్నుకోబడ్డ jury members లొ ఒకడు మన హీరో(John Cusak). ఇక కేస్ విషయానికొస్తే, ఒక Stock broker company లో ex-employee ఒకతను, ఆ company మీద కోపం తోనో, మరే కారణం చేతో, ఒకానొక ఉదయం గన్ తీసుకొచ్చి ఎడా పెడా కాల్చేస్తే చాలా మంది చనిపోతారు. అలా చనిపోయిన వాళ్ళలోని ఒకతని భార్య, నా భర్త మరణానికి కారణం ఇలా గన్స్ పబ్లిక్ మార్కెట్ లో ఎవరికి పడితే వల్లకి అమ్మటమే అని ఆ gun company మీద కేస్ వెస్తుంది. ఆ కేస్ trial కి వచ్చి, ఆ గన్ కంపెనీ తరపున Gene Hackman వెనుక ఉండి సూత్రధారిగా ఆ కేస్ ని గెలిపించాలని, అలాగే కేస్ వేసిన ఆమె తరపున Dustin Hoffman ఎలా అయినా ఆమెకి న్యాయం చెయ్యాలని వాదిస్తు ఉంటారు.

ఈ కేస్ లో కీలకమైన నిర్ణయం jury members చెతుల్లో ఉంటుంది. John Cusak ఆ jury members ని తనకు అనుకులం గా తిప్పుకుని, తను ఎలా చెప్తే వాళ్ళ్ అలా వినేలా చేసుకుంటాడు. ఇప్పుడు తను Gene Hackman కి, Dustin Hoffman కి బేరం పెడతాదు. మీరు నాకు 10 million dollars ఇస్తే నేను మీకు అనుకూలం గా నిర్ణయాన్ని jury members చేత ఇప్పిస్తాను అంటాడు. ఇదంతా బయట నుంచి తన girl friend Marlee phone calls తో చేస్తుంటుంది. వీళ్ళిద్దరూ డబ్బు కోసమే ఇలా చేస్తున్నారా లేక వేరే ఏదైనా బలమైన కారణం ఉందా అనేది చివరి 10 నిముషాల్లో తెలుస్తుంది. వీళ్ళకీ Gene Hackman కి సంబంధం ఏంటి? ఎందుకు తన మీద రివెంజ్(?) తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు? అన్ని ప్రశ్నలకీ, చిక్కుముళ్ళకీ సమాధానాలు చివరలో తెలుస్తాయి.

సినిమాకి బలం పకడ్బంధీగా ఉన్నా screen play. చివరి వరకూ ఆ సస్పెన్స్ ని మైంటైన్ చెయ్యటం కానీ, చివరలో ఆ చిక్కుముడి ని విప్పటం కానీ చాల బాగా చూపించారు. ఇలాంటి కధలు రాయటం లో సిద్దహస్తుడైన John Grisham నవల ఆధారం గా ఈ సినిమా తీసారు. నవల కూడా చాలా బాగుంటుందని విన్నాను కానీ, నేను చదవలేదు.

జాన్ గ్రిషమ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆయన నవలలు సినిమాలుగా తీసిన వాటి పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. వీటిలో దాదాపుగా అన్నీ చూసాను ఒకటి తప్ప.

1. A Time to Kill (Sandra Bullock, Samuel L. Jackson, Matthew McConaughey and Kevin Spacey)

2. The Chamber (Chris O'Donnell, Gene Hackman and Faye Dunaway)

3. The Client (Susan Sarandon, Tommy Lee Jones)

4. The Firm (Tom Cruise, Jeanne Tripplehorn and Gene Hackman)

5. The Pelican Brief (Julia Roberts and Denzel Washington)

6. The Rainmaker (Matt Damon, Danny DeVito)

7. Runaway Jury (Gene Hackman, Dustin Hoffman, John Cusack and Rachel Weisz)


ఇక నటీనటుల విషయానికొస్తే, దీంట్లో ముగ్గురు హేమాహేమీలు ఉన్నారు.

Gene Hackman,
Dustin Hoffman
మరియూ 2012 ద్వారా అందరికీ మరింత తెలిసిన John Cusak.
' మమ్మీ ' సినిమాల ద్వారా సుపరిచితురాలైన Rachel Weisz, John కి జోడీగా నటించారు.

నాకు Gene Hackman నటన చాలా ఇష్ఠం, ప్రతినాయకుడు ఎంత బలం గా ఉంటే నాయకుడికి అంత ప్రాముఖ్యత వస్తుంది. Gene Hackman కి Dustin Hoffman కి మధ్యన సీన్స్ కానీ, Gene Hackman కి John కి మధ్యన సీన్స్ కానీ అద్భుతం.

ఈ సినిమా గురించి మరింత వ్రాయాలని ఉంది కానీ, ఇప్పటికే ఎక్కువైపోయిందని ఇక్కడితో ఆపేస్తున్నాను. Law & Order drama లను ఇష్ఠపడేవాళ్ళకి మాత్రమే కాకుండా అన్నివర్గాల వారికీ ఈ సినిమా నచ్చేస్తుంది ఆ సినిమాలో ఉండే నటీ నటుల నటన వల్ల, tight screen play వల్ల. మీలో ఇప్పటికే ఈ సినిమా ని చూసేసి ఉండొచ్చు. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి !