•Friday, October 08, 2010
నేను ఈ వారం కధ కాస్త ఆలస్యంగా పోస్ట్ చెయ్య్డానికి ఒక కారణం ఉంది ...రెండు వారాల క్రితం ఇలాంటి ఒక శుక్రువారం (sept24th) నా మేనకోడలు మూడేళ్ళ అనన్య కార్ ప్రమాదం లో చనిపోయింది ...ఈ కధ రాసినప్పుడు నాకు తెలియదు నేను ఇలాంటి ఒక సంఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని .. నా చిన్న తమ్ముడు ఆంబులన్స్ నుండి ఫోన్ చేసి "అక్కా అనన్య చనిపోయింది " అన్న మాటలే నాకు పదే పదే వినిపిస్తున్నాయి ...కధ లో చెప్పినట్టుగా వాళ్ళకు జీవించడానికి కారణాలు చెప్పవలసి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ...ఎప్పుడు వార్తల్లో ఎమన్నా జరిగితే అయ్యో అనుకొని మనకు జరగవులే అనుకున్నాను ...కానీ ఇంటి ముందు ఆడుతూ పాడుతూ బాల్ కోసం వెళ్ళి ఎదురుంటి కారు కింద పడి ఇలా చిట్టి తల్లి ప్రాణం విడుస్తుందని కనీసం ఊహించను కూడా ఊహించలేదు.
మీ అందరికి తన గురించి చెప్పాలని ఉంది నాకు ...అందమైన కుటుంబం వాళ్ళది ..అమ్మా నాన్న ,మూడేళ్ళ అనన్య ,తనకి ఒక చిన్ని తమ్ముడు..చూసిన వాళ్ళందరు ముచ్చట పడేలా .అనన్య అందమైనది ,చాలా తెలివైనది ,ఎంద అందంగా పాడుతుందో .ఒక్కసారి మనం పాడి వినిపిస్తే చాలు అది యే భాష అయినా సరే పాడేస్తుంది .మాటలు కూడా పూర్తిగా రాకున్నా పాటలు మాత్రం ఒక్క తప్పు లేకుండా పాడుతుంది. అందరు దానికి మేనత్త పోలికలు అని అంటుంటే నేను ఎంత మురిసిపోయేదాన్నో. రెండేళ్ళ వయసులో తను ప్రపంచం లో అన్ని ప్రదేశాలు మాప్ లో గుర్తించేది . తల్లి తో తెలుగులో ,తండ్రితో మా అందరితో తమిళం లో మాట్ళాడేది . మూడు వారాలుగా ప్రీ స్కూల్ కి వెళ్ళడం మరియు టీవీ ద్వారా ఇంగ్లిష్ మాట్లాడడం నేర్చుకుంది. ప్రేమని చూపించడం లో తన నుండి నేను ఎన్నో నేర్చుకున్నాను . తన దగ్గరకి వెళ్ళినప్పుడల్లా చేతులతో హత్తుకొని ఎన్నో ముద్దులు పెట్టేది. ఇప్పుడు ఇంక ఎంత పిలిచినా తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోయింది . జీవితం ఆగదు .మిగతా వారి కోసం మనం ముందుకు నడవక తప్పదు .గుండెల్లో తనని పెట్టుకొని తన ముద్దు మాటలు అల్లరి నవ్వు తలచుకుంటూ తను లేని బాధను అనుభవిస్తూ బ్రతకడం నేర్చుకోవాలి.
అందరికి చిన్న విన్నపం ..ఎప్పుడైనా మీరు కార్ నడిపేటప్పుడు కాస్త ఆలోచించండి .కోపంగా కానీ లేదా ఎదో ఒక ఆలొచనతో కానీ ఫోన్ లో మాట్లాడుతు కానీ ఎప్పుడు కార్ నడపవద్దు .ఏ మాత్రం అజాగ్రత్త్త గా ఉన్నా ఎన్నో అనర్ధాలు జరగవచ్చు .అందరికి ఇలా జరుగుతుందని కాదు .కానీ ఇంకొకరికి ఎవరికీ ఇలాంటివి జరగ కూడదు అన్న తపనతోనే ఈ అభ్యర్ధన. చిన్న పిల్లలు ఆడుకుంటున్న ప్రదేశాలలో మరింత జాగ్రత్త గా ఉండాల్సిన భాధ్యత అందరికీ ఉంది .

జీవితం
|
17 comments:
అనన్య ఆత్మకు శాంతి కలగాలని ఈశ్వరుడిని కోరుకుంటున్నా
మంచి తెలివి గల పాప లాగా ఉంది,,we all missing a super kid,,
అనన్య పేరు కూడా బావుందండీ. చిన్నమ్మాయి మరణించిందంటే, మరీ కారు క్రిందపడి...తలచుకుంటెనే విచారంగా వుంది. నా సంతాపం పేరెంట్సుకి తెలియజేయగలరు.
చాలా బాధ వేసింది విని
భగవంతుడు మీఅందరికి ఈ దుఃఖం నుండి త్వరగా కోలుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ఏం చెప్పగలం ఇలాంటి సందర్భాల్లో - మీ బాధ అర్ధమవుతున్నది.
కామెంట్ పెట్టడానికికూడా మనసురావట్లేదండీ కన్నీళ్లు తప్ప ! అలాగని ఏమీ రాయకుండా వెళ్ళలేక పోతున్నా...చిట్టితల్లి ఆకాశంలో తారల నడుమ మెరుస్తూనే ఉంటుంది.
ఎమత వేదనాభరితమైన విషయం!! మీరు రాసింది చదివితేనే కన్నీళ్ళు ఆగలేదు ఇంక మీ కుటుంబసభ్యూల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నాను, సిరి గారు!
వీడియో చూస్తుంటే అనిపించింది ఆ చిట్టితల్లి పెద్దదైతే ఇంకా ఎన్నీన్ని అద్భుతాలు సాధించి ఉండేదా అని! భగవంతుడు ఎంత నిర్దయుడో కదా!!
స్టీరింగ్ వీల్ వెనక కూర్చున్న వాళ్ళు ఎంత బాధ్యతతో వ్యవహరించాలో నిజంగా ఎంతమంది గ్రహిస్తున్నారో ఈ రోజుల్లో అనిపిస్తోంది..
ఆ చిన్నారి ఆత్మకి పరిపూర్ణ శాంతి కలగాలని కోరుకుంటున్నాను...
siri garu,
deeniki naaku ela spandinchaalo teleedam ledu. ee muddula paapaki neno abhimaanini. thana videos youtube lo chusi entho ascharyam vesindi. thanu ledanna vishayam chadivina ventane kallallo neellu thirigaayi. paapam aa thallidandrulu ela thattukuntaaro :(
Ayyoe!Very sorry!
so sad to hear....my heartfelt condolences to her parents..బంగారు తల్లిని తీసుకెళ్లిపోవడానికి ఆ దేవుడెంతటి పాషాణ హృదయుడో!!
అయ్యో పాపం . ఏమంటానికీ మటలే రావటములేదు .
so sad.
may god give you lots of strength to you and your family.
మీ బాధని అర్ధం చేసుకోవటం, పంచుకోవటం తప్ప ఇంకేం చేయలేని అశక్తత! నిజంగా చిన్న పిల్లలకి ఏ ఆపదా రాకూడదని దేవుడు ఒక చట్టం చేస్తే బాగుండు. మీరే ఈ పరిస్థితిలో ధైర్యం తెచ్చుకొని ఆ చిన్నారి తల్లి తండ్రులకి ధైర్యాన్నివ్వాలండీ!
శారద
ఈ దారుణ దృశ్యం కళ్ళముందు మెదిలి చాలా బాధగా అనిపించిందండి. మీరు, మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తాను.
అయ్యో !
అనన్య ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా!! తను తప్పకుండా మరో రూపంలో మీ ఇంటికి వస్తుంది.....మీ బంగారు తల్లి మళ్లీ మీ నట్టింట చిందులు వేస్తుంది..