Author: Unknown
•Friday, March 27, 2009

మిత్రులందరికీ విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


ఉగాది మొదట యుగాదిగా పిలవబడేది. యుగాది అంటే యుగం ప్రారంభమైన రోజు. యుగాది కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. ఇది చైత్రశుద్ద పాడ్యమి నాడు వస్తుంది. ఈ పండుగ మనతో పాటు కన్నడిగులు, మరాఠీలు కూడా ఇదే రోజు చేసుకుంటారు.

చెట్లు ఆకులు రాల్చి మోడుల్లాగా చలికాలం అంతా అలా జీవచ్చవాల్లా నిలబడి, శిశిరం లో చిగురు తొడిగి పచ్చగా మారే తరుణం లో ఈ ఉగాది పండుగ వస్తుంది. జీవితం పైన ఒక ఆశని, భవిష్యత్తు మీద నమ్మకాన్ని పెంచుతూ, మనలో ఉత్తేజం నింపుతూ వస్తుంది.

పండుగ అనగానే మనకు కొత్తబట్టలు, పిండివంటలు, సెలవు రోజు, అందరి ముఖల్లో ఒకరకమైన ఆనందం ఇవన్నీ చూస్తాం.

ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, కొత్తబట్టలు కట్టుకుంటారు.గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, దేవుని పటాలను శుభ్రపరచి వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి పూజకు సిద్ధం చేసుకుంటారు. ఉగాది పచ్చడిని చేసి, పిండివంటలను దేవుని ముందు పెట్టి సమర్పించి, కొత్తసంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటూ నూతన సంవత్సరానికి శుభారంభం పలుకుతారు.

ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. మన జీవితాన్ని ఈ షడ్రుచులతో అన్వయించుకోవచ్చు.

కష్ఠాలు, కన్నీళ్ళు, ఉద్వేగాలు, కోపాలు, ఆనందం, చేదు జ్ఞాపకాలు .. ఇలా రకరకాల అనుభూతుల సమ్మేళనమే మానవ జీవతం. ప్రతి మనిషికీ ఇవన్నీ తన జీవిత గమనం లో తప్పని సరి. అన్ని రకాల అనుభూతులనూ రుచి చూస్తారు. అలాగే ఈ ఉగాది పచ్చడి లో అన్ని రకాల రుచులు కలిసి ఉంటాయి. ఇది మానవజీవితానికి మారు రూపు. సుఖదుఃఖ మిళితమైన మానవజీవితానికి ఇది ప్రతీక.

వేప పూత
మామిడి ముక్కలు
కొత్త బెల్లం
పచ్చి మిరపకాయ ముక్కలు
ఉప్పు
గసగసాలు
.. మొదలైనవాటిని కలిపి ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు.

"Life is full of flavors and one must enjoy and handle all of them with balance "



ఉగాది పచ్చడి తరువాత ఈ రోజు విశిష్ఠమైన మరొకటి పంచాంగ శ్రవణం.
పండితులు శ్రవణానందకరం గా ఈ పంచాంగ పఠనం చేస్తారు. మన రాసులు, నక్షత్రాలను బట్టి మనకు ఈ నూతన సంవత్సరం ఎలా ఉందో తెలియజేస్తారు. ఈ సంవత్సరం తమకు జరిగే యోగాలను, ఆదాయవ్యయాలను, రాజపూజ్య అవమానాలను పంచాంగం ద్వారా తెలియజేస్తారు.

ఈ విరోధి నామ సంవత్సరం లో అందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని ఆశిస్తూ...

మీ
వేణు & సిరి
This entry was posted on Friday, March 27, 2009 and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 comments:

On March 27, 2009 at 10:24 AM , Rajesh said...

bagundi venu article ...

venu and siri ... mee iddariki mariyu mee families ki

virodhi nama samvatsara subhakankshalu

 
On March 27, 2009 at 11:41 AM , Anonymous said...

Venu & siri..Ugaadi Subhaakaankshalu :)

 
On March 27, 2009 at 11:46 AM , Unknown said...

Thank you so much for stopping by and for your wishes guys !

mIku, mI faamily members andariki Ugadi wishes!

:)