Author: Unknown
•Thursday, March 26, 2009


Cast: Rebecca Hall (Vicky), Scarlett Johnson (Cristina), Javier Bardem (Juan Antonio Gonzalo), Penelope Cruz (Maria Elena)

Written & Dircted by : Woody Allen

Story line: Two girlfriends spent their summer in Barcelona, that changed their lives.

ఈ సినిమా గురించి మొదట నాకు తెలిసింది ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ అప్పుడు. ఈ సినిమాలోని Maria Elena character కి , Penelope Cruz కి Best supporting actress award వచ్చింది. ఆ తరువాత నా ఫ్రెండ్ ఈ సినిమాని చూసి మంచిగా చెప్పగా నాకూ చూడాలనే ఆసక్తి కలిగింది. తను చెప్పినట్లుగానే ఈ సినిమా ఒక మంచి రొమాంటిక్ కామెడీ.

కథ :

విక్కీ, క్రిస్టీనా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.
రీసెంట్ గా ఎంగేజ్ అయిన విక్కీ తన రీసెర్చ్ కోసం,
అలానే రీసెంట్ గా బోయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయిన క్రిస్టినా కొంత చేంజ్ కోసం
.. ఇద్దరూ సమ్మర్ కాంప్ ని స్పైన్ లోని బార్సెలోనా లో గడాపలని అనుకుంటారు. బార్సెలోనా లో ఉంటున్న విక్కీ కి దూరపు బంధువైన జూడీ ఇంట్లో దిగుతారు.

ఇద్దరూ ఆ ప్రదేశపు అందాల్ని, ఎట్రాక్షన్స్ ని చూస్తూ ఉండగా, ఒకరోజూ రెస్టారెంట్ లో ఒక అపరిచితుడు (Juan Antonio) వీళ్ళ దగ్గరికి వచ్చి, వీకెండ్ కి తను వెళ్ళే ప్లేస్ కి వాళ్ళిద్దరని రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఆలా సడన్ గా ఎవరో వచ్చి ఇలా అడగటాన్ని విక్కీ జీర్ణిచుకోలేక, ఇలా సడన్ గా ఎవరో త్లియకుండా వచ్చి రమ్మంటే వస్తారా అని విరుచుకుపడుతుంది. క్రిస్టినా మాత్రం ఇతనెవరో ఇంటెరెస్ట్ గా ఉన్నాడు వెళ్దామా అంటుంది. అలా మొదలైన పరిచయం వాళ్ళ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పును తెచ్చిందీ.. ప్రేమ, రిలేషన్స్ మీద అభిప్రాయాల్ని ఎలా మార్చిందీ అనేది చూడొచ్చు.

కధకుడు పాత్రల్ని మలచిన తీరు చాల బాగుంది. ఒకరకం గా సైకలాజికల్ డ్రామా ఇది. ఓక్కొకరిది ఒక్కో భిన్న మనస్తత్వం.

విక్కీ పాత్రేమో, ప్రేమకీ, రియాలిటీ కి మధ్య నలుగుతూ ఎటూ తేల్చుకోలేని మనసు,
క్రిస్టీనా ఏమో తనకు నచ్చింది, చెయ్యాలనుకున్నది ఏదైనా చెయ్యగలిగే ధైర్యం,
ఆంటోనియోది మనసులో ఏదీ దాచుకోకుండా straight forward గా చెప్పే కారెక్టర్ !

last but not least , Penelope Cruz. ఈమె ఆంటోనియో ex-wife గా నటించారు. కొంచెం సైకాటిక్ గా, ఆంటోనియో అంటే ఒక రకమైన obsession తో తనకి మళ్ళీ దగ్గరవ్వాలని, కానీ వాళ్ళ రిలేషన్ లో ఏదో మిస్ అవుతూ మళ్ళీ తనతో గొడవపడుతూ ఉండే పాత్ర !

నటులు, వారి నటన:

నా వరకు చెప్పాలంటే విక్కీ గా వేసిన అమ్మాయి నచ్చింది. ఈమెని ఇదే మొదటిసారి చూడటం ఈ సినిమాలో. చూడగానే ఆకర్షించే అమ్మాయి కాకపోయినా ఎక్కడో ఏదో ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది తనను చూస్తుంటే. చాలా బాగా చేసింది.
క్రిస్టినా గా వేసిన Scarlett ని ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసాను. నాచురల్ గా చేస్తుంది.

ఆంటోనియా గా వేసిన Javier Bardem కి ఆల్రేడీ తన నటనకు ( No country for old men) లాస్ట్ ఇయర్ best supporting actor వచ్చింది. ఆ పాత్రకి, ఆహార్యానికి ఇందులో పాత్రకీ ఎంత తేడా ఉందో. చార్మింగ్ గై గా చాలా బాగా చేసారు.

ఇంతకు ముందు చెప్పినట్లుగా Penelope Cruz చాలా బాగా చేసింది ఫన్నీ సైకాటిక్ ex-wife పాత్రలో..

రచన, దర్శకత్వం:

దీనికి రచయిత, దర్శకుడు గా Woody Allen పని చేసారు. ఈయన multi talented. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా చాలా సినిమాలు చేసారు. ఈ సినిమాని చక్కని రొమాంటిక్ డ్రామాగా మలిచారు.

నా విశ్లేషణ:

సరదాగా, అప్పుడప్పుడు సీరియస్ గా ఆలోచింపజేసే సినిమా ఇది. బార్సెలోనా అందాల్ని చక్కగా చూపించారు. బాగా నాచ్చేసింది ఈ ఊరు నాకు, ఎప్పటికైనా ఒక్కసారైనా ఈ ఊరు వెళ్ళి తీరాలి. సినిమాలో అప్పుడప్పుడు వచ్చే బార్సెలోనా స్పానిష్ పాట భలే నచ్చేసింది.

నాకు నచ్చిన అంశాలు:

బార్సెలోనా అందాలు
పాత్రలను మలిచిన తీరు
స్పానిష్ మ్యూజిక్
కాస్టింగ్
స్క్రీన్ ప్లే

ఇలాంటి సినిమాలు కొంచెం స్లోగా ఉంటాయి, ఎందుకంటే డ్రామా కాబట్టి. ఆలా ప్లెజెంట్ గా చూస్తూంటే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. రొమాంటిక్ డ్రామాలను, మానవ బంధాలను విశ్లేషించే సినిమాలను ఇష్ఠపడే వారికి ఇది నచ్చుతుంది.

This entry was posted on Thursday, March 26, 2009 and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments: