Cast: Kristen Stewart, Robert Pattinson, Billy Burke
Genre: Drama/Romance/Fantacy
Story line: A lion falls in love with a Lamb !
It's a cute love story ! This movie is based on Stephanie Meyer’s bestselling book series "Twilight".
చాలా రోజుల తరవాత ఒక మంచి రొమాంటిక్ మూవీ ని చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా మంది టీనేజర్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసిన మూవీ ఇది. No wonder they are so crazy about this movie. హీరో హీరోయిన్లిద్దరూ చక్కగా సరిపోయారు ఆ కారెక్టర్స్ కి. చాలా క్యూట్ గా ఉన్నారు ఇద్దరూ. The chemistry between them is electrifying !
**************************************
కధ ఒక ఫాంటసీ..
A teenage girl risks everything when she falls in love with a vampire. ఈ ఒక్క లైన్ లోనే కధ మొత్తం తెలిసిపోతుంది కదూ.వివరాల్లోకి వెళ్తే...
Bella (Kristen Stewart) , తల్లీ తండ్రీ విడిపోగా, తండ్రితో పాటు ఆరిజోనా స్టేట్ నుంచి వాషింగ్టన్ స్టేట్ లోని ఒక చిన్న ప్లేస్ ( Forks ) కి మూవ్ అవుతుంది. అక్కడ స్కూల్ లో జూనియర్ స్టూడెంట్ గా జాయిన్ అవుతుంది. అక్కడ కొత్తగా పరిచయం అయిన ఫ్రెండ్స్ తో పాటు, ఎవరితో కలవని, అందరిలోకీ ప్రత్యేకం గా కనిపించే Cullen’s family లోని ఒకరైన Edward (Robert Pattinson) తో పరిచయం అవుతుంది.
ఆ అమ్మాయంటే ఇష్ఠం కలుగుతూ, అంతలోనే తనకు దగ్గరైతే తనకి హాని జరుగుతుందేమో అని ఆందోళన పడుతూ ఉంటాదు ఎడ్వర్డ్ ! నెమ్మదిగా ఎడ్వర్డ్ గురించిన అసలు విషయం బెల్లా కు తెలుస్తుంది. ఎడ్వర్డ్ ఒక vampire. అతని ఫామిలీ మెంబర్స్ అందరూ కూడా vampires. కానీ మిగతా vampires లాగా వీళ్ళు మనుషులకు హాని చెయ్యరు, జంతువులని ఆహారం గా చేసుకుని ఉంటారు. ఎడ్వర్డ్, బెల్లా ఇద్దరూ ఒకరి మీద ఒకరు అమితమైన ఇష్ఠాన్ని, ప్రేమని పెంచుకుంటారు. వీరి ప్రేమని ఎడ్వర్డ్ ఫామిలీ అంగీకరిస్తున్న సమయం లో అనుకోని ప్రమాదం మనుషులని తినే వేరే vampire వలన కలుగుతుంది.
ఎడ్వర్డ్ బెల్లాని రక్షించుకోగలిగాడా?
ఎడ్వర్డ్ ఫామిలీ వీళ్ళ ప్రేమని ఆమోదించిందా?
ఎప్పటికీ మరణం లేని ఎడ్వర్డ్, సాధారణ అమ్మాయి బెల్లా మధ్య ప్రేమ నిలిచిందా?
వీటికి సమాధానాలు మీరే తెర మీద చూడండి.
**************************************
Kristen Stewart ని మొదట Panic room లో, JoDie Foster కూతురిగా చూసాను. అప్పుడే ఎంత పెద్దగా అయిపోయిందో. ఈ మధ్య లో తనని Jumper అనే మొవిఎ లో కూడా చుసాను. చాలా క్యూట్ గా ఉన్నారు. టీనేజర్ గా పెర్ఫెక్ట్ గా సరిపోయారు.
Robert Pattinson, ఇతను ఇంతకు ముందు Harry Potter సినిమాల్లో చూసినా అంతగా ఎక్కువ ప్రాధన్యత లేని కారెక్టర్ లో నటించారు. ఇందులో మాత్రం అదర గొట్టేసారు vampire గా. హీరో హీరోయిన్లు ఇద్దరూ ఇద్దరే. క్యూట్ కపుల్ !
**************************************
ఈ సినిమాలో నాకు నచ్చిన సీన్స్ చాలానే ఉన్నాయి. మొత్తమ్మీద నాకు బాగా నచ్చినవి:
* ఫొటోగ్రఫీ ( సినిమాలో ఎక్కువ భాగం Portland (Oregon), Seattle (Washington) పరిసర ప్రాంతాల్లో తీసారు. అంతటా పచ్చగా, కొండలు, లోయలు, జలపాతాలు, ఎంత బాగున్నాయో ! )
* హీరో హీరోయిన్లు ( వీళ్ళు చూడటానికి కానీ, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కాని చాలా బాగున్నాయి, woods లో వీరిద్దరి మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. They are so intense !)
* బెల్లా కి తన తండ్రికి ఉన్న ఎటాచ్మెంట్ !
* Vampires మధ్య సీన్స్ ( బేస్ బాల్ గేం, విలన్ vampire తో ఫైట్ )
* Climax ( Prom scene, the dance .. wow ! )
.. ఇలా నాకు నచ్చే చాలా అంశాలు ఉండటం వలన ఈ సినిమా నాకు బాగా నచ్చేసింది. ఈ సినిమా కి sequel ( The Twilight Saga: New Moon ) November, 2009 లో రాబోతుంది. ఈ సినిమా చూసిన ఇంప్రెషన్ రాబోయే దీని సీక్వెల్ కోసం ఎదురు చూసేలా చేసింది.
1 comments:
Good one :) all the best for new blog