Author: Unknown
•Wednesday, November 04, 2009
చాలా రోజుల తరువాత దేవిశ్రీ నుంచి మంచి సంగీతం వచ్చింది. మొన్ననే వచ్చిన ఏక్ నిరంజన్ (మణిశర్మ) తరువాత ఈ ఆర్య-2 పాటలు బాగా నచ్చేసాయి.

తెలుగులో ఈ తరం లో నాకు నచ్చిన సంగీత దర్శకులు ముగ్గురు, కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ.
కీరవాణి తన పాటల్లో వయోలెన్ ని బాగా వాడుకున్నట్లు, దేవి తన పాటల్లో గిటార్ ని ఎక్కువగా యూజ్ చేస్తారనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని పాటలు మెలోడియస్ గా, కొన్ని ఫాస్ట్ బీట్స్ తో ఉన్నాయి. ఈ పాటల గురించి నా రివ్యూ ఇది.


1. కరిగే లోగా ఈ క్షణం .. గడిపేయాలీ జీవితం
నా రేటింగ్ : * * * * *

ఈ పాట చాలా చాలా నచ్చేసింది. మొదట దేవి పాడిన వెర్షన్ విన్నాను. దేవి సంగీతం బాగున్నంతగా తన గొంతు ఉండదు. గీర ఎక్కువ ఉంటుంది. ఏంటో ఒక్క రెహ్మాన్ వాయిస్ తప్ప ఇంకే సంగీత దర్శకుడి వాయిస్ నచ్చదు. ఇళయరాజా కానీ, కీరవాణి కానీ, దేవిశ్రీ కానీ, చక్రి కాని, ఆర్.పి.పట్నాయక్ కాని, తమ గొంతులతో నానా హింస పెడతారనిపిస్తుంది జనాలని.

ఈ పాట రెండు వెర్షన్లు ఉంది. ఒకటి దేవి పాడితే మరొకటి కునాల్ మరియు మేఘ పాడారు. కునాల్ తన గొంతులో ఆవేదనని చాలా చక్కగా పలికించారు. ఆత్మ తో గొంతు కలిసి పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ పాట.

2. ఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటో
నా రేటింగ్ : * * * *

ఈ పాట కె.కె పాడారు. తన గొంతు పెక్యులియర్ గా బాగుంటుంది. ముందుగా చెప్పినట్లుగా ఈ పాటలో గిటార్ బాగా వాడుకున్నారు. సాహిత్యం కూడా చాలా బాగుంది ఈ పాటలో. ఈ సినిమా ప్రమోస్ లో ఈ పాట ఎక్కువ చూపిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిజంగానే చాలా స్టైలిష్ గా ఉన్నారు ఈ పాటలో. విరహం తో పాడే పాటలా ఉంది ఇది.

3. Baby .. He loves you ..loves u .. loves u so much !
నా రేటింగ్: * * * *

మాటలు పాట కలిపి ఉన్న పాట ఇది. సరదాగా ఉంది. దేవి పాడారు ఇది. మధ్యలో పిల్లల వాయిస్ క్యూట్ గా ఉన్నాయి. ఎంత ప్రేమిస్తున్నాడో వేరే వాటితో పోలుస్తూ పాడే పాట ఇది.

‘ తెల్ల తెల్లవారి పల్లెటూరిలోనా అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవుపాల నురగంత ‘

ఎంత బాగుందో చూడండి సాహిత్యం !

4. రింగ రింగ రింగ రింగ రింగారే
నా రేటింగ్: * * * *

మీరు కరెక్ట్గానే చూసారు. ఈ పాట 'slumdog millionaire' లోది కాదు. (Just kidding..)
ఈ సినిమాలో ఐటం సాంగ్ లా ఉంది ఇది. ప్రియ అని ఎవరొ కొత్త సింగర్ లా ఉన్నారు. మాంచి ఘాటు మషాలా లా ఉన్నా తమాషాగా నవ్వుకునేలా ఉన్నాయి లిరిక్స్. మధ్య లో వచ్చే దేవి మాటలు భలే కామెడీగా ఉన్నాయి. ఏవరో గోరీ పిల్లతో డాన్సాడించినట్లున్నారు.

5. Mr.Perfect
నా రేటింగ్: * * * 1/2

బాబా సెహ్గల్ దేవితో కలిసి పాడారు అంటేనే చెప్పొచ్చు ఇది పాప్ సాంగ్ అని. హీరో గురించిన పాట అది. హీరో ఎంత ఎదవో చెప్పే పాట. ఈ మధ్య సినిమాల్లో హీరో ఎంత పెద్ద ఎదవో వాడికే తెలీదుగా మరి.

6. My Love is Gone
నా రేటింగ్: * * *

రంజిత్ పాడారు ఇది. మరో ఫాస్ట్ బీట్ సాంగ్. లవ్ పోతేనే హాయిగా ఉంది అని పాడుకునే పాట ఇది. అన్నీ పోతాయి ఎప్పుడో ఒకప్పుడు, లవ్ పోతే ఏంటంట ! పర్లేదు సో సో గా ఉంది.

మొత్తమ్మీద ఈ ఆల్బం కి 4/5 ఇవ్వొచ్చు.
This entry was posted on Wednesday, November 04, 2009 and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments: